చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్య పిల్లల్ని స్కూల్ కి పంపించడం ఏ పిల్లలు కూడా మొదట్లో స్కూల్ కి ఇష్టపడి వెళ్ళరు. రోజు పేచీ పెట్టి వెళ్తూ ఉంటారు మీ పిల్లలు కూడా బాగా పేచి పెడుతూ ఉంటారా అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే.. మీ పిల్లలు స్కూల్ కి వెళ్ళమని పేచి పెడుతున్నట్లయితే కచ్చితంగా మీరు ఇలా పాటించాల్సిందే ముందు పిల్లలతో పాటు తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్ళాలి. మీరు తరగతి టీచర్ తో మాట్లాడి స్కూల్ దగ్గర ఉండాలి ఆ స్కూలు వాతావరణం చూసిన తర్వాత మీ పిల్లలు స్కూలు వాతావరణానికి అలవాటు పడతారు.
ఆ తర్వాత నెమ్మదిగా ఆసక్తి చూపిస్తారు. పిల్లల్ని స్కూల్ కి పంపించేటప్పుడు గట్టిగా అరవడం, తిట్టడం, కొట్టడం, కోప్పడడం చేయకూడదు అప్పుడు పిల్లలు భయపడతారు పైగా అఇష్టం కలుగుతుంది ఇష్టం కలగదు. పిల్లల్ని స్కూల్ కి పంపేటప్పుడు అనుకూలంగా మాట్లాడాలి స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో ఎలా గడిచింది ఏం నేర్చుకున్నావు ఇటువంటి ప్రశ్నలని అడగాలి.
అలానే పిల్లలు ఎలా ఉన్నారు అనేది టీచర్ని అడిగి తెలుసుకోవాలి టీచర్ చెప్పిన సలహాలు కూడా పాటించడం మంచిది. స్కూల్ కి వెళ్లేందుకు పిల్లల్ని ప్రోత్సహించాలి స్కూల్లో స్నేహితులని ఏర్పరచుకోమని చెప్తూ ఉండాలి. పిల్లలు స్కూల్ కి అలవాటు పడే వరకు తల్లిదండ్రులు సహనాన్ని కోల్పోకూడదు సహనంతో వాళ్ళని స్కూల్ కి పంపేందుకు ప్రయత్నం చేయాలి అలా చేస్తే కచ్చితంగా పిల్లలు నెమ్మదిగా స్కూల్ కి వెళ్లడం అలవాటు చేసుకుంటారు.