పిల్లలకి చదవడం అలవాటు చేయడం చాలా ముఖ్యం. పిల్లలు బాగా చదువుతూ ఉంటే వారి యొక్క జ్ఞానం పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. చదువుకునే అలవాటు ఉన్న పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా బాగా ఎక్కువ ఉంటుంది ఈ రోజుల్లో పిల్లలు పుస్తకాలు మీద ఎక్కువ శ్రద్ధ వహించడం లేదు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వలన పిల్లలు పుస్తకాలకు దూరం అవుతున్నారు.
పుస్తక పఠనం వలన ఎంతో నాలెడ్జ్ వస్తుంది. అది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ల వల్ల కలగదు. పిల్లల్లో చదివే అలవాటుని కచ్చితంగా, తల్లిదండ్రులు పెంపొందించాలి. అందుకోసమే ఈ చిట్కాలు పాటించడం మంచిది. ఆసక్తికరమైన పుస్తకాలని అలవాటు చేస్తే మంచిది. ఆసక్తికరమైన పుస్తకాలను తెచ్చి చదివించినట్లయితే పిల్లలకి పుస్తకాల మీద ఆసక్తి పెరుగుతుంది.
చిన్న చిన్న గోల్స్ ని పెట్టుకోవాలి. చదవడం అనేది పిల్లలకి ఎప్పుడు భారం అవ్వకూడదు ఆసక్తి ని ఎప్పుడూ పెంపొందించాలి చిన్న చిన్న పుస్తకాలు వాళ్ల కోసం తీసుకు రావాలి వీలైతే చిన్న చిన్న బహుమతుల్ని కూడా వాళ్ళకి ఇవ్వండి. పిల్లలు చదివిన పుస్తకం గురించి మాట్లాడుతూ ఉండండి. చదివిన టాపిక్ మీద క్వశ్చన్స్ అడగండి. ఇలా నెమ్మది నెమ్మదిగా పిల్లలను చదువు మీద శ్రద్ధ వహించేలా చూసుకోండి. అప్పుడు పిల్లలు పుస్తకాలకి దగ్గరగా ఉంటారు పుస్తకాలు మీద ఆసక్తి చూపుతారు.