జులై నెల ఆఖరికి వచ్చేశాం. ఇక ఆగస్టు వచ్చేసింది. బ్యాంకు పనులు ఏమైనా ఉంటే జర సెలవులు ఎక్కవగా ఉన్నాయి చూసుకోండి. ఆగస్టులో బ్యాంక్లకు 14 రోజుల పాటు సెలవు లభించనుంది. అంటే ఈ లెక్కన వచ్చే నెలలో సగం రోజులే పనిచేస్తాయనమాట. ఇంతకీ ఏ ఏ రోజులు సెలవులు వచ్చాయి.
ఆగస్టులో సెలవులు..
ఆగస్టు 6, ఆదివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 8, మంగళవారం:- టెండాంగ్‌లో రుమ్ ఫాట్, గ్యాంగ్టక్లోని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 12, రెండో శనివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 13, ఆదివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 15, మంగళవారం:- స్వాతంత్ర్య దినోత్సవం, దేశవ్యాప్తంగా బ్యాంక్లకు హాలీడే.
ఆగస్టు 16, బుధవారం:- పార్సీ నూతన ఏడాది, బేలాపూర్, ముంబై, నాగ్పూర్లోని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 18, శుక్రవారం:- శ్రీమంత శంకర్దేవ తిథి, గువాహటిలోని బ్యాంక్లకు హాలీడే.
ఆగస్టు 20, ఆదివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 26, నాలుగో శనివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 27, ఆదివారం:- అన్ని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 28, సోమవారం:- మొదటి ఓనమ్, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంక్లకు సెలవు.
ఆగస్టు 29, మంగళవారం:- తిరు ఓనమ్, కొచ్చి- తిరువనంతపురంలోని బ్యాంక్లకు హాలీడే.
ఆగస్టు 30, బుధవారం:- రక్షా బంధన్, జైపూర్, శిమ్లాలోని బ్యాంక్లకు హాలీడే.
ఆగస్టు 31, గురువారం:- శ్రీ నారాయణ గురు జయంతి, పాంగ్ హోబ్సోల్- డెహ్రాడూన్, గ్యాంగ్టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలోని బ్యాంక్లకు సెలవు.
డిజిటల్ బ్యాంకు సేవలు..
బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే టైమ్ సేవ్ అవుతుంది.