కరోనా వైరస్ వ్యాప్తిపై రోజుకోక పరిశోధన పత్రాలు విడుదల చేస్తున్నాయి అంతర్జాతీయ వర్సీటీలు..తాజాగా కరోనా సెకండ్ వేవ్‌పై లాన్‌సెట్ జర్నల్లో మరో పరిశోధన పత్రం ప్రచురించింది..దీంతో ప్రపంచ దేశాలు అందోళన చెందుతున్నాయి..కరోనా ఒక సారి వచ్చిపోతే బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని దాని వల్ల మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని,ఒక వేళ వైరస్ సంక్రమించిన ప్రమాదం ఉండదని గత పరిశోధనలు తెలిపాయి..కాని తాజాగా మరో పరిశోధనతో ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తుంది.
కరోనా రెండవ సారి సంక్రమిస్తే, అలాంటి వారికి చాలా తీవ్రమైన వైరస్ లక్షణాలు నమోదు అవుతాయని అమెరికా డాక్టర్లు చెపుతున్నారు. దీనికి సంబంధించి లాన్‌సెట్ జర్నల్ లో పరిశోధన అంశాలను ప్రచురించారు. కరోనా వైరస్ రెండవసారి సోకితే, అప్పుడు లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయని లాన్‌సెట్ నివేదికలో పేర్కొన్నారు. ఒకసారి వైరస్ నుంచి కోలుకుంటే, మళ్లీ రాదన్న గ్యారెంటీ లేదన్నారు. 25ఏళ్ల నెవడా పేషెంట్‌కు రెండు సార్లు భిన్నమైన కరోనా వైరస్‌లు 48రోజుల తేడాలో సంక్రమించాయని, రెండవ సారి పేషెంట్ ఆక్సిజన్ సపోర్ట్ చికిత్స తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రీఇన్‌ఫెక్షన్ కేసులకు సంబంధించి లాన్‌సెట్ జర్నలో మరికొన్ని నివేదికలు జోడించారు. బెల్జియం, నెదర్లాండ్స్, హాంగ్‌కాంగ్, ఈక్వెడార్ దేశాల్లో కూడా ఇలాంటి రీఇన్‌ఫెక్షన్ కేసులు నమోదు అయినట్లు పేర్కొంది.