ఏపీలో ఆ ఎమ్మెల్యే రాజీనామా… ఉప ఎన్నిక‌కు వైసీపీ రెడీనా…!

-

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వైసీపీలోకి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆయ‌న ఎప్పుడు పార్టీ మార‌తారు ? అన్న‌ది మాత్ర‌మే వెయిట్ చేయాలి కాని.. పార్టీ మార‌డం అయితే ఖ‌రారైంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం గంటా ఆగ‌స్టు 15 వ‌తేదీకి కాస్త అటూ ఇటూగా మూడు ముహూర్తాలు చూసుకున్నార‌ని… వీటిల్లో ఏదో ఒక ముహూర్తానికి ఆయ‌న పార్టీ మార‌తార‌ని అంటున్నారు. ఇక గంటా గ‌తంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన విధంగా టీడీపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌వ్వ‌డంతో పాటు వైసీపీ అనుబంధం ఎమ్మెల్యేగా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌.

ఆయ‌న పార్టీకి రాజీనామా చేయ‌డంతో పాటు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేస్తార‌ని అంటున్నారు. గంటా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తే విశాఖ నార్త్ నియోజ‌క‌వ‌ర్గానికి ఖ‌చ్చితంగా ఉప ఎన్నిక వ‌స్తుంది. అప్పుడు అక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిగా ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత నార్త్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కె.కె.రాజును పోటీ చేయిస్తార‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో కెకె. రాజు వైసీపీ నుంచి పోటీ చేసి గంటాకు గ‌ట్టి పోటీ ఇచ్చి కేవ‌లం 1900 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఇప్పుడు రాజుకే సీటు ఇవ్వ‌డంతో పాటు ఆయ‌న్ను గెలిపించి తీసుకు వ‌చ్చే బాధ్య‌త‌ను సైతం వైసీపీ అధిష్టానం గంటా మీదే పెడుతుంద‌ట‌.

గంటాకు రాజును గెలిపించుకు రావాల‌న్న కండీష‌న్ పెట్ట‌డంతో పాటు రాజు గెలిచాక గంటాకు మంచి నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చేలా ఒప్పందం కుదిరిన‌ట్టు టాక్‌. ఇక ఇప్పుడు అమ‌రావ‌తి రాజ‌ధాని నేప‌థ్యంల రాజీనామాల స‌వాళ్లు న‌డుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉప ఎన్నిక‌కు వెళ్లి మ‌రీ స‌త్తా చాటాల‌న్న‌దే సీఎం జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇక రాజీనామా చేసి పార్టీ మారితే టీడీపీ వాళ్లు త‌న‌ను విమ‌ర్శించేందుకు కూడా స్కోప్ ఉండ‌ద‌ని.. అలాగే వైసీపీలో తనపై కొంత గౌరవం కూడా పెరుగుతుందని గంటాశ్రీనివాసరావు భావిస్తున్నార‌ట‌.

అయితే గంటా మ‌ళ్లీ నామినేటెడ్ పోస్టుతో విశాఖ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాలంటే ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకోవ‌డంతో పాటు రాజును ఉప ఎన్నిక‌ల్లో గెలిపించి స‌గ‌ర్వంగా త‌న స‌త్తా చాటుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version