ఇండిపెండెంట్ గా పోటీ చేసి నేనేంటో చంద్రబాబు కి చూపిస్తా : పరిపూర్ణానంద స్వామి

-

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఆ పార్టీ పెద్దలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీపై నా అభిప్రాయం చెప్పేందుకే వచ్చానని అన్నారు. ఇప్పుడు కాదు.. పొత్తులు పెట్టుకోవడానికి ముందే నా అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

హిందూపురం నియోజకవర్గాన్ని వదలి నేను ఎక్కడికీ వెళ్లను అని తేల్చి చెప్పారు. హిందూపురంలో నేను పోటీ చేస్తే ముస్లింల ఓట్లు రావు అని చంద్రబాబు అంటున్నారు.. తానేంటో ఇక్కడే ఇంటిపెండెంట్గా పోటీ చేసి చూపిస్తా అని పరిపూర్ణానంద షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని అని చెప్పారు. బీజేపీ నేతల్లా మాటలు మార్చే వ్యక్తిని కాదని పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version