పెరిగిన SBI డెబిట్ కార్టు ఛార్జీలు .. ఎప్పటి నుంచి అమలు అంటే ?

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరో షాక్ ఇచ్చింది.కొన్ని డెబిట్ కార్టులకు సంబంధించిన నిర్వహణ ఛార్జీలను పెంచింది. SBI యువ, గోల్డ్, కాంబో , ప్లాటినం,క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డుల ఛార్జీలు పెరుగనున్నట్లు వెల్లడించింది.

ఇక ఈ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

సవరించబడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్టు ఛార్జీలు :

యువా, గోల్డ్,కాంబో డెబిట్ కార్డ్ , మైకార్డ్(ఇమేజ్ కార్డ్) వంటి డెబిట్ కార్డుల ఇయర్ మెయింటెనెన్స్ ఛార్జీలు ప్రస్తుతం ఉన్న రూ. 175 నుంచి రూ.250కి పెంపు.

క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డుల ఇయర్ మెయింటెనెన్స్ కు ప్రస్తుతము ఉన్న రూ.125 నుంచి 200+GST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం డెబిట్ కార్డ్ కోసం ఇయర్ మెయింటెనెన్స్ ఛార్జీలు ప్రస్తుత ఛార్జీలు రూ. 175లు. నుంచి రూ.325 కి పెరగనున్నాయి.

ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు వంటి SBI డెబిట్ కార్డులకు సంవత్సరానికి మెయింటెనెన్స్ ఛార్జీలు ప్రస్తుతం ఉన్న రూ. 350 నుంచి రూ.425 కు పెరగనున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version