నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగనివ్వను – కె.ఏ పాల్

-

నల్లగొండ జిల్లా చండూరు రిటర్నింగ్ కార్యాలయం వద్ద స్క్రూట్ ని కొనసాగుతోంది. స్క్రూటీనీకి హాజరయ్యారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ ఆధ్వర్యంలోనే నడుస్తుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నా తర్వాత వచ్చిన వారిని లోపలికి పంపించారని.. నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగదు… జరగనివ్వనని అన్నారు.

పది తులాల బంగారం ఇచ్చినా తీసుకొని.. మునుగోడు ఉప ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని అన్నారు. కెసిఆర్ కమ్యూనిస్టులను కొనేశాడని ఆరోపించారు. మునుగోడులో నన్ను గెలిపిస్తే ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు, ఉపాధి, ఉద్యోగం, రైతులకు రుణమాఫీ, మంచినీరు, రోడ్లు కాలేజీ యూనివర్సిటీ ఆరు నెలల్లో చేసి చూపిస్తానని అన్నారు. పార్టీ మారిన సర్పంచ్ లకు రెండు కోట్లు ఇస్తున్నారని ఆరోపించారు.

మునుగోడు ప్రజలకు బుద్ధుంటే, తెలివితేటలు వాడి ఇచ్చిన డబ్బు తీసుకొని నన్ను గెలిపించండని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి నాకు ఓటేసి గెలిపించాలన్నారు. బిజెపి కి బీ పార్టీగా కేసీఆర్ బిఆర్ఎస్ పెట్టాడన్నారు కే ఏ పాల్. బూర నర్సయ్య గౌడ్ బిజెపిలో చేరడం కంటే టిఆర్ఎస్ పార్టీలో ఉండడమే బెటర్ అని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version