ఏపీ బీజేపీకి ఇంతకాలం అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానే సోము వీర్రాజుకు పార్టీపగ్గాలు అందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రభావం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనకు ప్లస్సా.. మైనస్సా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. కన్నా ఉన్నప్పుడు పవన్ కు బాగానే ఉండేది… కాస్త అటు ఇటుగా వీరిద్దరూ టీడీపీతో మాంచి సంబంధాలే కలిగి ఉండేవారు! ఇప్పుడు బీజేపీ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజుకి బాధ్యతలు అప్పగించారు! మరి ఇప్పుడు పవన్ ప్లాన్ ఏమిటి?
రాబోయే ఎన్నికల్లో బీజేపీ – జనసేనలు కలిసి ఎన్నికలకు వెళ్లిన సమయంలో పవన్ కల్యాణ్ నే సీఎం అభ్యర్ధిగా పెట్టి ముందుకు కదిలే ఆలోచనలు బీజేపీ పెద్దలు చేయొచ్చని అప్పట్లో కథనాలు వచ్చాయి! అప్పుడున్న పరిస్థితుల్లో అది సమర్ధనీయమే అనే మాటలు కూడా వినిపించాయి. మరి ఈ సమయంలో దూకుడున్న సోము వీర్రాజుకీ బాధ్యతలు వచ్చేసరికి… పవన్ ఏమి చేయాలి? పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ అలవాట్లను పక్కనపెట్టి ఎలా ముందుకు సాగాలి?
నిన్నమొన్నటివరకూ రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో బీజేపీతో పోల్చిచూస్తే జనసేన బలంగా ముందుకుపోయేది. ఈ సమయంలో.. బీజేపీని కలుపుకుని ముందుకు వెళ్లండి అని పవన్ తన కేడరు కు నిత్యం సూచిస్తూ ఉండేవరు! కానీ… బీజేపీకంటే తమ కేడర్ కే ఎక్కువబలం అని నమ్మారో ఏమో కానీ.. ఆ విషయంలో ముందుకు రాలేదు జనసైనికులు! కానీ… సోము వచ్చాక ఆ పరిస్థితులు రివర్స్ అవ్వొచ్చనే ఊగాహాణాలు వినిపిస్తున్నాయి.
కన్నా – చంద్రబాబు – పవన్ లు కాస్త అటు ఇటుగా ఒకే లక్ష్యంతో ముందుకువెళ్తున్న క్రమంలో… ఏపీ బీజేపీని ఏమాత్రం పట్టించుకోలేదు! ఇప్పుడు సోము గనక కాస్త యాక్టివ్ అయ్యి.. చేయాల్సిందంతా చేస్తూ.. ప్రధాన ప్రతిపక్షం సైతం సిగ్గుపడేలా ప్రజల్లో ముందుకుపోతూ.. పార్టీని బలపరుచుకుంటే.. కచ్చితంగా పవన్ మరింత దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది! ఎందుకంటే… ఏపీలో బీజేపీకి బలం లేదు కాబట్టి… పవన్ ఆ సామాజికవర్గంలో బలమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి… జనసేనతో పొత్తు పొడిచింది. కానీ…ఏపీలో బీజేపీ తనకు తాను కాస్తో కూస్తో కేడర్ ని సంపాదించుకుంటే… పవన్ అవసరం బీజేపీకి… “ఖచ్చితం కాదు”.. ఇప్పుడున్నంత “అత్యవసరం కాదు”!
సో… పవన్ మరింత దూకుడు పెంచాలి. ఏపీలో ఎప్పటికీ బీజేపీ కంటే జనసేన బలమైన పార్టీ అని చెపుకునేలా ముందుకు పోవాలి. అలా కానిపక్షంలో ఇటు టీడీపీని వదులుకుని.. అటు బీజేపీతో వదిలించుకుని.. ఇబ్బందులు వచ్చే ప్రమాధం ఉంది! అలా కాకుండా.. జనసేనను బలంగా మార్చుకుంటూ.. మరింతగా గ్రౌండ్ లెవెల్ లో కేడర్ లో ఉత్సాహం నింపుతూ, ముందుకు తీసుకుని వెళ్తే… ఎప్పటికీ బీజేపీకి ఏపీలో జనసేన ఒక ముఖ్యమైన అవసరంగా ఉంటుంది. అలా కానిపక్షంలో… మరోసారి ఆటలో అరటిపండే!!