అదే నిజమైతే ఏకంగా రాజకీయాలు మానేస్తా : ఎంపీ ఈటల

-

మూసీ పునరుజ్జీవం విషయంలో బీజేపీ ఆడేవి డ్రామాలైతే తాను రాజకీయాలను వదిలేస్తానని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్తీ నిద్రలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన ఎల్‌బీ నగర్‌‌లోని మూసీ పరివాహక ప్రాంతంలోని ఓ ఇంట్లో నిద్రించిన విషయం తెలిసిందే. అనంతరం ఉదయం బస్తీవాసులతో ముచ్చటించారు. బీజేపీవి డ్రామాలని మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

ఈటల మాట్లాడుతూ బీజేపీవి డ్రామాలైతే మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిద్దామని అక్కడి ప్రజలు తమవి డ్రామాలని తేల్చితే రాజకీయాలు మానేస్తానంటూ కామెంట్స్ చేశారు. ఒకవేళ ప్రభుత్వానివే డ్రామాలని వాళ్లు చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని మంత్రి పొన్నంకు సవాల్ విసిరారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ధోరణి ఒక్కటేనని ఆరోపించారు.రూ.లక్షలు పోసి కట్టుకున్న నిరుపేదల ఇళ్లను కూలగొడతామంటే ఊరుకోబోమని ఈటల ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కూల్చివేతలకు ఎన్ని బుల్డోజర్లు వచ్చినా అడ్డుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news