ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్లో సంచలన కామెంట్స్ చేశారు. అటు కూటమి ప్రభుత్వాన్ని తూర్పార బట్టిన ఆయన.. చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచుతాడని పేర్కొన్నారు.
ఇక ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, వైసీపీ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారి గురించి జగన్ ప్రస్తావిస్తూ.. ‘మా రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బయటకు వెళ్లారు.రాజకీయాల్లో ఎవరికైనా సరే క్యారెక్టర్ ఉండాలి.ప్రలోభాలు,భయంతో క్యారెక్టర్ తగ్గించుకోవద్దు. విజయసాయి సహా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది’ అని మాజీ సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.