సికింద్రాబాద్లోని అడ్డగుట్టలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో తీవ్ర రసాభాస నెలకొంది.కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మేమంటే మేము పంపిణీ చేస్తామని అనుకోవడంతో ఇరువురి మధ్య చెక్కుల పంపిణీ విషయంలో వాగ్వాదం నెలకొంది. పోటాపోటీ నినాదాల మధ్య ఎమ్మెల్యే పద్మారావు చెక్కులు పంపిణీ చేశారు.
ఎవరైనా చెక్కుల పంపిణీ ప్రక్రియను అడ్డుకోవాలని చూసి గలాట చేస్తే బొక్కలు విరగ్గొడతాం అంటూ మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై పద్మారావు ఫైర్ అయ్యారు.