ఊపిరి పోయేలా ఉంది.. ఊరికి రప్పించండి.. కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళా..!

-

సాధారణంగా మన దేశం విడిచి వెళ్తే.. అధికంగా డబ్బులు వస్తాయని మంచిగా బ్రతకవచ్చని చాలా మంది ప్రస్తుతం ఇతర దేశాలకు వెళ్తుంటారు. అయితే అక్కడ కొంతమంది సేఫ్ గానే ఉంటే.. మరికొందరూ మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా ఓ మహిళా కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. ఊపిరి పోయేలా ఉంది. ఊరికి రప్పించండి అంటూ కువైట్ లో చిక్కుకున్నటువంటి ఏపీ మహిళా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి అభ్యర్థించిన వీడియో వైరల్ గా మారింది. 

ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన పందిరి అమ్ములు.. ఆరు నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా కువైట్ లో ఇంటి పని చేసేందుకు వెల్లారు. బతుకుదెరువు కోసం దూర దేశం వస్తే.. పరిమితికి మించిన పనులు చెబుతూ చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. స్వగ్రామానికి పంపాలని ఏజెంట్ ని కోరితే.. ఓ గదిలో బంధించి రూ.2లక్షలు చెల్లించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి తిండి లేక ఆరోగ్యం క్షీణిస్తోందని.. కూటమి ప్రభుత్వం స్పందించి తనను ఇంటికి చేర్చాలని కన్నీటి పర్వంతమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version