వాట్సాప్ ని నమ్మొచ్చా…?

-

ప్రస్తుతం కమ్యూనికేషన్‌ రంగంలో వాట్సాప్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సోషల్ మెసేజింగ్ యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాను అన్ని విధాలుగా షేక్ చేస్తుంది అనేది వాస్తవం. మన దేశంలోనే దాదాపుగా 45 కోట్ల మంది దీన్ని వాడుతున్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కుటుంబ, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ, ఆర్ధిక ఇలా ఏది చూసినా సరే వాట్సాప్ క్రేజ్ అంతా ఇంతా కాదు.

అయితే దీనిపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన జీవితమే ఒక రకంగా వాట్సాప్ లో ఉంది కాబట్టి ఇది ఎంత వరకు సేఫ్ అనే ప్రశ్న వినపడుతుంది. నిజంగా హ్యాకర్లు తలచుకుంటే – వాట్సాప్‌ లో యూజర్ల సమాచారానికి సెక్యూరిటీ ఉంటుందా?, అమెజాన్‌ ఓనర్‌ జెఫ్‌ బెజోస్‌ ఐఫోన్‌ని కూడా వాట్సాప్‌ ద్వారానే హ్యాక్‌ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

దీనితో అసలు వాట్సాప్ భద్రతపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. హ్యాకర్ తలుచుకుంటే ఆపిల్ కే దిక్కు లేదు వాట్సాప్ ఎంత అనేది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాట్సాప్‌ మెసేజింగ్‌తో ఎలాంటి ప్రాబ్లెమూ లేదు… మాది ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అని వాట్సాప్ చెప్తుంది. దాన్ని హ్యాక్ చేయడం పెద్ద విషయం కాదు అనేది కొందరి మాట. కాబట్టి వాట్సాప్ ఇప్పుడు తమ వినియోగదారులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.

వాట్సాప్ అనేది జీవితాలతో ముడిపడి ఉన్న వ్యవహారం చిన్న తేడా వచ్చినా సరే ప్రాణం పోతుంది. కాబట్టి తమ అనుమానాలకు వాట్సాప్ నుంచి సమాధానం రావాలని ప్రతీ యూజర్ కోరుకునే అవకాశం ఉంది కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఆ సంస్థపై ఉంది. ఇక వాట్సాప్ వాడకం విషయంలో అంత గుడ్డి నమ్మకం వద్దు అనేది కూడా నిపుణుల వాదనగా ఉంది.

వాట్సాప్‌ లో 2019 లో వాట్సాప్‌ లో ఉన్న 12 భద్రతాపరమైన సమస్యల్ని స్వయంగా వాట్సాపే బయటపెట్టింది. వాటిలో 5 సమస్యలు సాధారణమైనవి. 7 సమస్యలు క్రిటికల్‌ మరి వాటిని ఇప్పుడు సరి చేసినా సరే భయం మాత్రం అలాగే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version