వైసీపీ పాదయాత్ర చేస్తే.. నేనే మ‌ద్ద‌త్తు తెలుపుతా : ప‌వ‌న్ క‌ళ్యాణ్

-

వైపీనీ కి పాద‌యాత్ర లు చేసే అల‌వాటు ఉంద‌ని.. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటు కు వ్య‌తిరేకం గా పాద‌యాత్ర చేయాల‌ని జ‌న సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పాదయాత్ర చేస్తే తానే మొదటగా సంఘీభావం తెలుపుతానని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటు ప‌రం గా కాకుండా ఉండాలంటే వైసీపీనే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.అయితే ప్ర‌యివేటీక‌ర‌ణను ఆప‌డం త‌మ‌ చేతుల్లో లేదని వైసీపీ అంటుంద‌ని అన్నారు.

కానీ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రైవేటీకరణ ఆపుతామని ఎందుకు ప్రచారం చేశార‌ని విమ‌ర్శించారు. అలాగే స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉంటే గుంటూర్ లో ఎందుకు దీక్ష చేస్తున్నావ‌ని విమ‌ర్శ‌లు చేస్తార‌ని అన్నారు. అయితే వారికి గ‌తంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రాణాలర్పించింది గుంటూరు జిల్లాకు చెందిన మహనీయుడేనని వైసీపీకి గుర్తులేదా అని ప్ర‌శ్నించారు. అలాగే విశాఖ లో సభ పెడితే తాడే ప‌ల్లి కి విన‌బ‌డ‌ద‌ని అందుకే అమరావతిలో దీక్ష చేపట్టానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news