ఆ దేశంలో లావుగా ఉంటే శిక్షలు వేస్తారట..ఎందుకో తెలుసా?

-

ప్రపంచంలో కొన్ని దేశాల్లో కొన్ని విచిత్రమైన చట్టాలు ఉన్నాయి. వాటి గురించి వింటే నిజంగా అలాంటి చట్టాలు ఉన్నాయా అనే డౌట్ రాక మానదు..అలాంటి ఒక విచిత్రమైన చట్టం జపాన్ లో ఉంది. నిజంగా దాని గురించి వింటే మాత్రం అవాక్కవుతారు.జపాన్ లో వాళ్లంతా ఎందుకు సన్నగా ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా?వాళ్లు తిండి తినరేమో..ఇలాంటి చాలా సందెహాలు వస్తున్నాయి. కదూ..అందుకు కారణం కూడా లేకపోతే..అందుకు ఒక చట్టం ఉందని తెలుస్తుంది.


ఈ చట్టం ఆ దేశ ప్రజలు లావుగా ఉండేందుకు అంగీకరించదు. జపాన్‌లో, అధిక శరీర బరువు కలిగి ఉండటం అంటే లావుగా ఉండటం చట్టవిరుద్ధం.జపాన్ దేశంలోని ఈ వింత చట్టం కారణంగా.. ప్రపంచంలోనే అతి తక్కువ ఊబకాయం రేటు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. చట్టంతో పాటు జపాన్ ప్రజల ఆహారం, అక్కడి రవాణా వ్యవస్థ కూడా ప్రజలు సన్నబడడంలో కొంతమేర పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడి ప్రజల ఆహారంలో చేపలు, కూరగాయలు, బియ్యం ఉన్నాయి. అంతే కాకుండా ప్రజా రవాణా కోసం ఎక్కువ దూరం నడవడం, నడక సంస్కృతి వల్ల ప్రజలు ఊబకాయం బారిన పడరు. జపాన్‌లో అమల్లో ఉన్న ఈ వింత చట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ చట్టాన్ని  ‘మెటాబో లా’ అంటారు. దీనిని జపాన్ ఆరోగ్య, కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2008లో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ద్వారా, 40 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు, మహిళల నడుము వార్షిక కొలత తీసుకుంటారు. స్త్రీల నడుము పరిమాణం 33.5 అంగుళాలు పురుషులకు ఇది 35.4 అంగుళాలు ఉండాలి..అయితే లావుగా ఉంటే ఉభకాయం   మధుమేహం వస్తుందని,దానికి ఖర్చులు అధికంగా ఉంటాయని ఈ చట్టాన్ని అమల్లొకి తీసుకొని వచ్చారు.

జపాన్‌లో ఊబకాయానికి అధికారిక శిక్ష లేదు. దానికి బదిలు వేరే పనిష్మెంట్లు ఉన్నాయి. ఇవి ప్రజలను సన్నగా చేస్తాయి. ఎవరైనా లావుగా ఉంటే సన్నబడటానికి వెంటనే క్లాస్ తీసుకుంటారు. లావుగా ఉన్న వ్యక్తి పని చేసే సంస్థతో అతన్ని ఒంటరిగా వదిలేయండి, కొన్ని సామాజిక ఆంక్షలు ఉంటాయి..అప్పుడు ఒత్తిడికి గురై సన్నగా అయిపోతాడు..ఆ తర్వాత అతను అందరితో మాములుగా ఉంటాడట..

Read more RELATED
Recommended to you

Exit mobile version