తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త. జనవరిలో ప్రారంభమయ్యే కంటి వెలుగు రెండోవిడత కార్యక్రమంలో 55 లక్షల మందికి కళ్లద్దాలు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందులో అక్కడికక్కడే 30 లక్షల రీడింగ్ గ్లాసులు, 25 లక్షల చతార్వి కళ్లద్దాలు ఇవ్వనున్నారు.
అవసరమైన కళ్లద్దాల కోసం సంబంధిత కంపెనీలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆపరేషన్ అవసరమైన వారి పేర్లను నమోదు చేసుకొని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలోని ఆశపత్రుల్లో చేస్తారు.
ఈ మేరకు ఆయా ఆసపత్రులలోనూ అధికారులు చర్చిస్తున్నారు. కంటి వెలుగు నిర్వహణకు గాను రాష్ట్రవ్యాప్తంగా 1,500 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఆప్తమాలజిస్టులు చాలామంది కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి కూడా వారిని నియమిస్తారు. అందుకు సంబంధించి జిల్లాల్లో త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.