రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు పథకాల కోసం చాలా మంది ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న నిర్వహించిన గ్రామసభల్లో తన పేరు రాలేదని, తనకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని మండల అధికారికి కాల్ చేసి విన్నవించుకున్నాడు. దీంతో సదరు ఎంపీడీవ ‘తిక్క..*డవా’ అంటూ ఓ బూతు పురాణం మొదలెట్టాడు.
ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో మంగళవారం వెలుగుచూసింది. శివ మాల వేసుకున్న ఓ వ్యక్తిని ఎంపీడీఓ ఇష్టానుసారంగా తిట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన అన్ని సంక్షేమ పథకాలకు తాను అర్హుడు అయినప్పటికీ అధికారులు సర్వేలో అనర్హులుగా ఎలా ప్రకటించారని సదరు వ్యక్తి ఆ మండలాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సార్ మీరు 12 అయినా ఇంకా ఆఫీస్కు ఎందుకు రావడంలేదని అడిగినందుకు.. తిక్క…*లా మాట్లాడొద్దంటూ బూతులతో ఆ అధికారి రెచ్చిపోయినట్లు తెలిసింది.