డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పద్మ అవార్డులపై వివాదం : బీజేపీ ఎమ్మెల్యే

-

కాంగ్రెస్ పాలన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాష్ట్రంలో నాలుగు పథకాలు ప్రారంభిస్తామని గొప్పగా చెప్పారు. కానీ మండలంలోని ఒక గ్రామంలో మాత్రమే పథకాలు అమలు చేస్తున్నారు. కాబట్టి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

అయితే ఆ ప్రజల వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ నేతలు పద్మ అవార్డులపై మాట్లాడుతున్నారు. ఢిల్లీ ముఖం చూడని వాళ్ళకు కూడా మోడీ ప్రభుత్వం పద్మ అవార్డులు ఇచ్చింది. సిస్టం ప్రకారం పద్మ అవార్డులు ఇస్తారు. కాంట్రవర్సీ రాజకీయాలు చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వలేదు. ఆరు గ్యారంటీల అమలు చేస్తారని కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. కానీ ప్రజలు తిరగబడతారని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పద్మ అవార్డుల పై వివాదం రెపుతున్నారు. ఇక మేము గద్దర్ కి వ్యతిరేకం కాదు గద్దర్ భావజాలానికి వ్యతిరేకం అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version