మీరు అలా పిలుస్తుంటే… నాకు భయం వేస్తోంది : పవన్ కళ్యాణ్

-

మీరు సీఎం..సీఎం అంటే నాకు భయం వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఆయన మాట్లాడుతూ.. ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటే ఏదైనా జరుగుతుందన్నారు. ప్రపంచం గుర్తించేలా పిఠాపురం నుంచి మార్పు ప్రారంభించాలని సంకల్పిస్తున్నామని అన్నారు. మీ గొంతే నా గొంతు మీ కలే నా కల అని అన్నారు. గత పదేళ్లుగా పార్టీ పెట్టి ఎన్నో వ్యయప్రయాసలు పడ్డానని గుర్తుచేశారు. పదవులు వచ్చినంత మాత్రనా తల ఎగుర వేయకూడదని తెలిపారు. వ్యక్తిగత ద్యేషాలకు విధ్వాంశాలకు పాల్పడవద్దని కార్యకర్తలకు నాయకులకు ఆయన సూచించారు.

ప్రతిపక్షం లేదని అనుకోవద్దు సమస్య వచ్చినప్పుడు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీశాఖలో 425 పోస్టులు ఖాళీగా ఉన్నాయని..ఫారెస్ట్ చెక్ పోస్టుల్లో నిఘా కొరవడిందని అన్నారు. ఆంధ్రా నుంచి అక్రమంగా రవాణా చేసిన ఎర్రచందనం దుంగలను నేపాల్ లో పట్టుకున్నారని , ఈ ఫైల్ తన దగ్గరకు వచ్చినట్లు తెలిపారు. బియ్యం అక్రమ రవాణాను అడ్ఢుకోమని మంత్రి మనోహర్ కు చెప్పినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version