నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రుతుపవనాలకు తోడు దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తాజాగా మరో 4 రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ ప్రకారం పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే కొన్ని చోట్ల ఈదురు గాలులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా నిండుకుండలా మారిన చెరువులు, వాగుల పై అధికారులు దృష్టి సారించారు. సాధారణ ప్రజలను వరదలు వచ్చే ప్రాంతాల వైపు వెళ్లకుండా చర్యలు అంతే కాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.