వంటల్లో వాడే పసుపుకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనందరికీ తెలుసు పసుపు యాంటిబయాటిక్ అని.. కట్ అయిన వెంటనే పసుపు వేయడం ఇంట్లో అందరికి అలవాటు. అయితే పసుపు డయెబటిక్స్ ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుందట. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు పసుపును ఎలా వాడాలో చూద్దామా..!
పసుపును ఈ విధంగా తీసుకోవాలి
పసుపు – దాల్చిన చెక్క: ఒక గ్లాసు పాలలో పసుపు, దాల్చిన చెక్క పొడిని కలిపి వేడి చేసుకొని తాగవచ్చు. అదేవిధంగా ఈ పాలను అల్పాహారంలో కూడా తీసుకోవచ్చు. పసుపుతో పాటు దాల్చిన చెక్క కూడా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
పసుపు – నల్ల మిరియాలు: పసుపుతో పాటు నల్లమిరియాలు తీసుకోవడం వల్ల డయబెటిక్ పేషెంట్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పసుపు, నల్లమిరియాలను పాలతో కలిపి తీసుకోవచ్చు. దీనికోసం ఒక గ్లాసు పాలలో పసుపు, ఎండుమిరియాల పొడి వేసి వేడి చేసి డైలీ తాగాలి.
పసుపు – ఉసిరి: పసుపుతో పాటు, ఉసిరి కూడా డయబెటిక్‌కు మంచిదే. ఉసిరికాయలో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీని కోసం ఉసిరి పొడి, పసుపును మిక్స్ చేసి పాలలో కలిపి తీసుకోవచ్చు. ఈ మిశ్రమం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇలా పసుపుతో మీకు వీలుగా ఉన్నది ఏదో ఒకటి చేస్తే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. షుగర్ ఒక్కసారి వచ్చిందంటే..లైఫ్ అంతా ఉంటుంది. కాబట్టి షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసుకోవాలి. మందులు వాడుతూ మంచి జీవనశైలి పాటిస్తే.. షుగర్ పెద్ద సమస్యే కాదు.
పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే..ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.