నన్ను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. యువతికి వేధింపులు!

-

రాష్ట్రంలో లైంగిక వేధింపుల ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ప్రేమపేరుతో వేధింపులకు గురిచేయడం, అందుకు యువతి నో చెబితే వారిపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు ఇటీవల వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రబుద్ధుడు తనను ప్రేమించకపోతే యువతితో పాటు ఆమె ఇంట్లోవారిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో నివాసముంటున్న ఓ యువతి గతంలో విజయ్ అనే వ్యక్తితో స్నేహం చేసింది. అతను ఆమెను అనేకసార్లు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాక్కున్నట్లు యువతి ఫిర్యాదు చేసింది. అతన్ని ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా..మీ అమ్మ, నాన్నను చంపేస్తా అని బెదిరించాడని.. విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతులు కూడా మోసపోయారని బాధితురాలు తెలిపింది. దీంతో హయత్ నగర్ పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version