కలలో సముద్రం వస్తే.. ఏం జరుగుతుందో తెలుసా!

-

సాధారణంగా మనం పడుకున్నప్పుడు పగలు కానీ, రాత్రి కాని కలలు రావడం సర్వసాధారణం. అయితే పగటి కలలు నెరవేరవని, తెల్లవారుజామున వచ్చే కలలు జరుగుతాయని అందరూ నమ్ముతారు. కానీ కలలో సముద్రం, నీటికి సంబంధించినవి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా.? కలలో సముద్రం, అలలు వస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం.

జలవనరుల ఖాతాలో సముద్రం నుంచి పిల్లకాలువల వరకు నీటి ప్రవాహానికి సంబంధించినవన్నీ చేరుతాయి. కలలో సముద్రం అలలతో ఎగసిపడుతున్నట్లు వస్తే లేదా ఆ అలలు మనల్ని చుట్టుముట్టి నట్లు వచ్చినా ఆపద వలయంలో మనం ఇరుకున్నట్లు సంకేతం.

అలాగే ఏదైనా పడవలో ప్రయాణించినట్లు కల వస్తే మనం సుదూర ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా వెళ్తామని సంకేతం. అలలు లేకుండా నిర్మలమైన సముద్రం మన కలలో కనిపిస్తే, మనం అనుకున్న పనులు సాఫీగా జరుగుతాయి. నది మనకు బాగా పరిచయం. నదులు అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటాయి. నదీ ప్రవాహం నిర్మలంగా ఉంటే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి.

అయితే ఒక్కొక్కసారి నదిలో నీరు మురికిగా ఉన్నట్టు మన కలలో కనిపిస్తే దుష్ట ఆలోచనలతో మనసు పాడవుతుంది. నీటిలో మీరు గాని లేదా ఎవరైనా దూకుతున్న టు కలలో కనిపిస్తే అది అశుభానికి సంకేతం. అలా కాకుండా నదిని ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు ఈదుతున్నట్టు కలలో కనిపిస్తే మన జీవితంలోని ఒడిదుడుకులను నుంచి మనం బయట పడినట్లు.

నీరు పారుతున్న కాలువలు కలలో కనిపిస్తే ప్రయాణ సూచనగా భావించాలి. కాలువలో నీరు స్వచ్ఛంగా లేకపోతే మీ ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి అని సంకేతం. కాలువలో మీరు కొట్టుకుపోతున్నటు కలలో వస్తే, మీ మీద అపవాదం పడుతుందని అర్థం. వరలతో కూడిన బావి కలలో కనిపిస్తే మీకు ధన లాభం చేకూరుతుందని అర్ధం.

బావిలో నీటి మట్టం పెరిగినట్లు కలలో వస్తే ధన నష్టం వాటిల్లుతుంది. బావిలో పడి ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నట్టు కలలో వస్తే సమీప బంధువులు ఎవరైనా దుర్మరణం పొందుతారని సంకేతం.

Read more RELATED
Recommended to you

Exit mobile version