ఈ మేకప్‌ హ్యాక్స్‌ ఫాలో అయ్యారంటే.. ఉన్న అందం కూడా పోతుంది..!!

-

మేకప్‌ వేసుకోవడం అనేది మహిళలకు నిత్యవసరం అయిపోయింది.. బయటకు అడుగుపెడుతున్నారంటే.. చాలామంది మహిళలు మేకప్‌ లేనిది రావడం లేదు. అందంగా ఉండటం అవసరమే.. కానీ అది మన కొంపముంచేలా ఉండొద్దు కదా.. కొంతమంది పేదాలకు వాడాల్సింది.. కళ్లకు వాడుతుంటారు. ఇలా చేయకుడని కొన్ని టెక్నిక్స్‌ ఉంటాయి. సోషల్ మీడియాలో ఎన్నో మేకప్ హ్యాక్స్ లభిస్తున్నాయి. అయితే అవి కొన్ని సరిగా పని చేయకపోగా అనవసరమైన ఇబ్బందులు తీసుకొస్తాయి. అలాంటివి కొన్ని..

బ్లష్‌గా లిప్ స్టిక్..

కాస్మోటిక్స్ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు లిప్ స్టిక్‌ని బ్లష్‌గా అప్లై చేస్తారు. ముదురు రంగు లిప్ స్టిక్ లేదా లిక్విడ్ మ్యాట్ లిప్ స్టిక్‌లను బ్లష్‌గా ఉపయోగించకూడదని చర్మ సౌందర్య నిపుణులు అంటున్నారు.. ఎందుకంటే ఇవి పెదవులకు ముదురు రంగుని ఇచ్చేందుకు వాడతారు. వాటిని బుగ్గలకు బ్లష్ చేస్తే స్కిన్ కలర్ మారుతుంది. అది చూసేందుకు అందంగా ఉండదు. బదులుగా లేత రంగు క్రీమ్ బ్లష్‌ని ఉపయోగించుకోవచ్చు.

కనురెప్పలకు పెట్రోలియం జెల్లీ

చాలా మందికి కనురెప్పలు తక్కువగా ఉండి కనిపించవు. పొడవైన కనురెప్పలు కావాలని అనుకునే వాళ్ళు వెంట్రుకలకు పెట్రోలియం జెల్లీ పూస్తారు. ఇది వెంట్రుకల మందం చేయదు. పొడవుగాను చూపించదు. పైగా కళ్ళ కింద చిన్న సిస్ట్‌లు ఏర్పడతాయి. పొడవాటి కనురెప్పలు కావాలంటే ఆముదం రాయాలి.

లిప్ లైనర్ కంటికి..

లిప్ లైనర్స్ కొంతమంది కళ్ళకు కూడా వేస్తారు. కానీ అవి కళ్ళకు చికాకు కలిగిస్తాయి. అందుకే ఈ టెక్నిక్ పాటించొద్దని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైపర్ పిగ్మెంటేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు డార్క్ సర్కిల్స్ చుట్టూ కాజల్ తక్కువగా అప్లై చేయాలి.

మొహానికి వాక్స్..

చేతులు, కాళ్ళు మీద గ్లూ రాశి బ్లాక్ హెడ్స్ తీసేస్తారు. కానీ దాన్ని ముఖం మీద ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలి. దీని తయారీకి ఉపయోగించే రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి.. ఒక్కోసారి గర్భం కూడా దాల్చలేరు అంత ప్రమాదం ఇవి.. ఇవి చర్మం మీద అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది.

డియోడరెంట్ రోలర్..

ఇది చాలా ప్రమాదకరమైనది. డియాడరెంట్ రోలర్ మొహం మీద పెట్టుకోకూడదు. ఇది అనేక రసాయనాలు ఉపయోగించి చేస్తారు. వాటిలో కొన్ని చర్మానికి చికాకు పెడతాయి. కొన్ని సార్లు మచ్చలు కూడా ఏర్పడవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version