యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం మైఖేల్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ట్రైలర్ ని ఇటీవల విడుదల చేయగా.. దానికి ఆడియన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ముఖ్య పాత్రలో నటించాడు. ఆయనతో పాటు వరుణ్ సందేష్, దివ్యాంశ కౌశిక్ లు ఈ సినిమాలో భాగం కావడం గమనార్హం.
భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా సందీప్ కిషన్ కెరియర్ లోనే భారీ బ్లాక్ బాస్టర్ అవుతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిన్ను హైదరాబాదులో జరపగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైకేల్ మూవీ టీం నాని గురించి ప్రత్యేకమైన ఏవిని ప్రదర్శించగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నేడు నాచురల్ స్టార్ గా ఎదిగిన నాని సినీ ప్రస్థానం గురించి చాలా గొప్పగా ఏవి లో చూపించారు. ఆ ఏవీ లో అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వచ్చినప్పుడు.. నాని గురించి గొప్పగా మాట్లాడిన మాటలను ప్లే చేశారు.
అది చూసిన నాని కి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాని గురించి దాదాపుగా ప్రతి సెలబ్రిటీ కూడా మంచిగానే మాట్లాడుతారు. కానీ పవన్ కళ్యాణ్ మాటలకి నాని అంతలా ఎమోషనల్ అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ మీద ఆయనకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.