ఆధార్‌ నంబర్‌ మర్చిపోతే.. ఇలా తెలుసుకోండి!

-

ఆధార్‌ కార్డు ప్రతిఒక్కరికీ చాలా ముఖ్యం. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా.. ఆధార్‌ తప్పనిసరి. అయితే, ఎప్పుడైనా ఆధార్‌ను తీసుకెళ్లడం మర్చిపోతే.. సాధారణంగా కొంతమంది ఆ 12 సంఖ్య యూఐఏఐడీ నంబర్‌ను గుర్తుంచుకోలేరు కూడా. ఇక కంగారు పడిపోయే పరిస్థతి ఏర్పడుతుంది. అరెరే నంబర్‌ అన్న గుర్తుంచుకోవాల్సిందని అప్పుడు అనిపిస్తుంది. అయితే.. ఈ కంగారు అవసరం లేదు. ఒకవేళ ఆధార్‌ నంబర్‌ మీకు అత్యవసరమైతే సులభంగా ఇలా చేస్తే సరిపోతుంది.

దీనికి మీ వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. అందులో ఇంటర్నెట్‌ తప్పనిసరి. దీంతో నిమిషాల్లో ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఆధార్‌ నంబర్‌ మన మొబైల్‌ నంబర్‌తో లింక్‌ అయి ఉండాలి. అప్పడే ఆధార్‌ నంబర్‌ తెలుసుకోవడానికి వీలుపడుతుంది. మొదట మొబైల్‌లో నెట్‌ ఆన్‌ చేసి, గూగుల్‌ ఓపెన్‌ చేయాలి.

 

  • అప్పడు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ https://uidai.gov.in/ ఓపెన్‌ చేయాలి.
  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయ్యాక ‘మై ఆధార్‌’ సెక్షన్‌ లోని ‘ఆధార్‌ సర్వీసెస్‌’లో ఉన్న ‘రిట్రైవ్‌ లాస్ట్‌ ఆర్‌ ఫర్గాటెన్‌ ఈఐడీ/యూఐడీ’ సెలెక్ట్‌ చేయాలి.
  • అప్పుడు కొత్త పేజి ఓపెన్‌ అవుతుంది. అందులో ఆధార్‌ నంబర్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మొబైల్‌ నంబర్‌ లేదా ఈ మెయిల్‌ ఐడీ ఎంటర్‌ చేయాలి . అనంతరం క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి, ‘ సెండ్‌ ఓటీపీ’ పై క్లిక్‌ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది.
  • ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి లాగిన్‌ పై క్లిక్‌ చేయాలి. అంతే మీ ఆధార్‌ నంబర్‌కు సంబంధించి యూఐడీ నంబర్‌ మీకు కనిపిస్తుంది. ఇక ఎప్పుడైనా ఆధార్‌ కార్డు మరచిపోతే ఇలా తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version