తాజాగా LIC కస్టమర్స్ ని హెచ్చరించింది. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరు తమ లోగోని ఉపయోగించ వద్దని చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
కంపెనీ అనుమతి లేకుండా ఎవరు LIC లోగో ఉపయోగించ వద్దని. అది నిజంగా తప్పని, శిక్షార్హమని తెలిపింది. ఒకవేళ కనుక ఎవరైనా ఇలా చేస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఎల్‌ఐసీ అంది.
ఈ విషయాన్ని స్వయంగా ఎల్‌ఐసీ ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. కంపెనీ అనుమతి లేకుండా ఎవరు ఎల్‌ఐసీ లోగో ఉపయోగించకూడదని చెప్పడం జరిగింది. ఇలా చేసిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంది.
ఇది ఇలా ఉండగా మోసగాళ్ల తో జాగ్రత్తగా ఉండాలని ఎల్‌ఐసీ కస్టమర్లను కోరింది. ఎల్‌ఐసీ అధికారులు ఫోన్ కాల్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ నెంబర్లు, నామినీ వివరాలు అడగరు అని వాటిని చెప్పొద్దని కూడా తెలిపింది. ఒకవేళ అనుమానిత కాల్స్ లేదా అనుమానాస్పద మెయిల్స్ వస్తే spuriouscalls@licindia.comకు తెలియజేయాలని అంది.