మహిళల వీపుపై తొక్కితే పిల్లలు పుడతారంట.. ఎక్కడో తెలుసా..?

-

మానవుడు రాతి యుగం నుండి రాకెట్‌ యుగంలోకి దూసుకుపోతున్నాడు. కొన్ని గంటల్లో భూ మండలాన్ని చుట్టి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. కానీ మన దేశంలో మూఢ నమ్మకాలు ఇంకా పోలేదు. ముఖ్యంగా, వెనుకబడిన రాష్ట్రాలతో పాటు గిరిజన ప్రాబల్య రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా నమ్ముతుంటారు. ఇక ఆధునికయుగంలో కూడా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. మూఢ నమ్మకాలో లేక వారి నమ్మకమో తెలియదు గానీ సంతానలేమితో బాధపడే వారి కోసం వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ధమ్‌తరీ జిల్లాలోలో పూజారుల చేత తొక్కించుకుంటే పిల్లలు పుడతారనే నమ్మకం ఆ ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకునిపోయింది.

childrens

ఇక సంతానం లేని వందలాది మంది మహిళలు బోర్లా పడుకోగా, పూజారులు, మంత్రగాళ్లు వారిని తొక్కుకుంటూ వెళ్లిన వైనం సోషల్ మీడియాల్లో వైరల్ గా మారిందవి. ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధాయి జాతరకు ప్రతి ఏడాది వేలాది మంది తరలివస్తారు. అంగామోతి మాత దేవాలయం వద్ద ఈ జాతర జరుగుతుంది.

ఈ సంవత్సరం కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ ఈ సారి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలన్నింటినీ గాలికి వదిలేశారు. పూజారులు వీపుపై తొక్కితే పిల్లలు పుడతారని అక్కడ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లి తాను మహిళల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తానని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ కిరణ్యయి నాయక్ తెలిపారు.

అయితే మహిళలపై కొందరు పురుషులు అలా నడుచుకుంటూ వెళ్లడం సరికాదని చెప్పారు. వారి మత విశ్వాసాలు దెబ్బతినకుండానే తాము త్వరలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. 52 గ్రామాల నుంచి తరలివచ్చిన దాదాపు 200 మంది మహిళలు నేలపై బోర్లా పడుకుని ఉండగా పదుల సంఖ్యలో పూజారులు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. అమ్మవారికి సమర్పించడానికి వారు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రిని భక్తులు తీసుకువచ్చి సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version