ఇండియన్ వంటకాల్లో ఇంగువకు ప్రత్యేకస్థానం ఉంది. ఘాటనై ఇంగువ వాసన వంటకాల్లో మంచి రుచిన ఇస్తుంది. అసలు ఇంగువతో తాలింపు వేసిన పప్పు, సాంబార్లు అయితే ఆ సువాసన వీధి చివరవరకు వెళ్లాల్సిందే. ఇంగులో కేవలం సువాసన ఇచ్చే గుణమే కాదు..ఇతర ఔషధ గుణాలు కూడా బోలెడు ఉన్నాయి. కడపు ఉబ్బరాన్ని తగ్గించటంలో ఇంగువ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇంగువలో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు చూద్దాం.
కణుతులను తగ్గించడంలోనూ ఇంగువ ఎఫెక్టివ్‌గా పనిచేస్తోందని అధ్యయనాల్లో తేలింది. లంగ్స్, లివర్, కిడ్నీ, బ్రెస్ట్ క్యాన్సర్‌ల వ్యాప్తిని తగ్గించడంలోనూ పనిచేస్తున్నట్టు వెల్లడయింది. క్యాన్సర్ వల్ల బరువు కోల్పోయిన వారు తిరిగి బరువు పెరగడానికి సహాయపడుతుంది.
నపుంసకత్వం: వంటలలో ఉపయోగించే ఈ ఔషధ మూలికను మగవారిలో నపుంసకత్వం తగ్గించేందుకు కూడా వాడతారు. దీనిని కామాతురత పెంచడంలో వాడుతారు.
తలనొప్పి: నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రియిన్లు, తలనొప్పులు ఇట్టే పోతాయి. నిమ్మరసంతో కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి ఒక అద్భుతమైన మందుగా పని చేస్తుంది.
అజీర్తి: ఇంగువను అజీర్తికి ఇంటివైద్యంగా మన పెద్దోళ్లు ఉపయోగిస్తున్నారు. దీనిలోని కడుపు మంటను తగ్గించే గుణం, యాంటిఆక్సిడెంట్ లక్షణాలు, చికాకు పెట్టే కడుపు, పేగులో వాయువు, పేగు పురుగులు, అపానవాయువు, చికాకుపెట్టే పేగు వ్యాధి ఐబీఎస్ మొదలైన అజీర్తి లక్షణాలను తగ్గించడంలో ఇంగువ సహాయం చేస్తుంది. ఒక అరకప్పు నీటిలో చిన్న చిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్తి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
డయాబెటిస్: ఇంగువను డయాబెటిస్ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇది క్లోమ కణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి తద్వారా మరింత ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి కాకర కాయను ఇంగువతో కలిపి వండుకోవటం మంచిది.
పీరియడ్స్ సమస్య నివారిణి: పీరియడ్స్ పెయిన్స్ ఎలా ఉంటాయో ప్రతిమహిళకు తెలుసు..ఆ బాధ ఎంతో ఘోరంగా ఉంటుంది. రుతు సంబంధ సమస్యలు నొప్పి, తిమ్మిరి, బాధతోకూడిన రుతుక్రమాలు వంటి వాటికి ఇంగువ ఒక శక్తివంతమైన మందు. ఈ ఔషధ మూలికను కాండిడ అంటువ్యాధి, ల్యుకోరియ యోని నుండి చిక్కటి తెల్లనైన/పసుపు రంగు స్రావం వంటి వ్యాధులను తగ్గించడానికి కూడా వాడతారు.
శ్వాస సంబంధిత వ్యాధులు: శ్వాస సంబంధ అంటువ్యాధులను తగ్గించడానికి, కఫము తగ్గించటానికి, ఛాతీ పైన ఒత్తిడి తగ్గించటానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. తేనే, అల్లంలతో కూడిన ఇంగువను దీర్ఘకాలగా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం వాడవచ్చు.
రోగనిరోధక శక్తి: ఇంగువలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. గాయాలు, చర్మ వ్యాధులకు ఇంగువ మంచి మందు. కాసిన్ని నీటిలో ఇంగువను వేసి ఆ ద్రవాన్ని చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.
అధిక రక్తపోటు: ఇంగువలో ఉన్న కొమరిన్ లు రక్తాన్ని పలుచన చేసి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. ఇంగువ వైద్యప్రభావంతో పాటుగా అధిక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ కు వ్యతిరేకంగా రక్షిస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు ఇంగువను వాడొచ్చు.
చర్మ వ్యాధులు: అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో సమర్థవంతమైన చికిత్స కోసం ఔషధ లక్షణాలున్న ఇంగువను వాడతారు. దీనిని పుండ్లు, ఉన్న చర్మంపై కూడా నేరుగా పూయవచ్చు.
మలబద్దకానికి : మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకో బోయేముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పళ్ళు ఆరోగ్యానికి : పళ్ళు పుచ్చిపోయి ఉంటే రాత్రి పడుకునేముందు కాస్త ఇంగువ ఆ పంటిపై ఉంచితే క్రిములు దెబ్బకి మటుమాయం అవుతాయి.
నరాల లోపాలు: ఆహారంలో వాడే ఈ రుచికరమైన పదార్ధం నరాలను ఉత్తేజితం చేయటంలో బాగా పనిచేస్తుంది. అందువలన ఇది మూర్ఛ, వంకరలు పోవటం, సొమ్మసిల్లుట, ఇతర నాడీ సంబంధిత క్రమరాహిత్యాల సమస్య ఉన్నవారు ఇది తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ఇలా ఇంగువలో ఇన్ని ఔషధగుణాలు ఉన్నయనమాట..చాలామందికి ఇంగువ వాసన నచ్చక దానిని దూరంపెడుతుంటారు. కానీ ఇంతమంచి గుణాలు ఉన్న ఇంగువను మీరు తినే ఆహారంలో కనీసం వారానికి రెండుమూడు సార్లు అయినా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుంది కదా.!