బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

-

ఇటీవల కాలంలో ఎంటర్టైన్మెంట్ ప్రపంచం బాగా ఎక్కువగా అయిందని చెప్పవచ్చు. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన బిత్తిరి సత్తి ఏ విధంగా పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీడియా న్యూస్ ఛానల్ ద్వారా సరదాగా వార్తలు చెబుతూ ఉండే బిత్తిరి సత్తి అటు తరువాత పలు సినిమాలలో కూడా నటించాడు. ఈ మధ్యకాలంలో కొత్త దారిలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.బిత్తిరి సత్తి అంటే అందరికీ బాగా గుర్తుకు వచ్చేది తీన్మార్ వార్తలు.. అప్పట్లో కేవలం బిత్తిరి సత్తి కోసమే ఆ వార్తలను ఎక్కువగా చూసేవారు. తన బాడీ లాంగ్వేజ్తో తెలంగాణ భాష తో అన్ని వర్గాలకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. బిత్తిరి సత్తి అసలు పేరు.. రవికుమార్. ఈయన చేవెళ్ల ప్రాంతాలకు చెందిన రైతు కుటుంబంలో జన్మించారు. టెలివిజన్ రంగంలోనే కాకుండా సినిమాల్లో కూడా మెల్లమెల్లగా క్రేజ్ను అందుకుంటున్నారు బిత్తిరి సత్తి.బిత్తిరి సత్తి పాడిన కొన్ని పాటలు యూట్యూబ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. మిమిక్రీ లో కూడా ఎంతో అద్భుతంగా పేరుపొందాడు బిత్తిరి సత్తి. ప్రస్తుతం బిత్తిరి సత్తి ప్రతినెల రూ.5 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మొదట పని చేసిన మీడియా న్యూస్ ఛానల్ లో కేవలం వేలల్లో జీతం తీసుకునే బిత్తిరి సత్తి ఆ తరువాత ఛానల్ మారగా రూ.3 లక్షల వరకు పెంచారు. తరువాత ప్రైవేటు యాడ్ కోసం.. రూ.7 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా సరికొత్త ఫార్మాట్ లో ముందుకు వెళుతున్నాడు. పెద్ద సినిమాలకు సంబంధించి స్టార్స్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయడానికి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. టెలివిజన్ రంగంలో అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒప్పో ఇంటర్వ్యూ కోసం రూ.2లక్షల రూపాయలు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇంటర్వ్యూలను సుమ కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version