లోకల్ ట్రైన్ లో ప్రయాణించే వారి కష్టాలు గురించి చాలా మందికి తెలియదు.. రైల్లో ప్రయాణించేందుకు టిక్కెట్ కొనాలంటే క్యూ లో నిలబడాలి.. అక్కడ టిక్కెట్ ను పొందాలంటే ఎన్ని కష్టాలు పడలో వారికే తెలుసు.. ముఖ్యంగా రైలు ఎక్కిన దగ్గర్నుండి టికెట్ కొనే వరకు పొడవాటి క్యూలలో నిల్చోవాల్సిన కష్టాల గురించి మీకు బాగా తెలుసు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన తర్వాత ప్రతి రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్‌లో ఇలాంటి ‘సూపర్‌ఫాస్ట్’ ఉద్యోగి అవసరమని మీరు ఖచ్చితంగా అంటారు.
కానీ అది ఎందుకో వీడియో చూసిన తర్వాత మీకు సమాధానం లభిస్తుంది. ఈ వీడియోను ట్విట్టర్ హ్యాండిల్ @mumbairailusers జూన్ 29న షేర్ చేసింది. అతను క్యాప్షన్‌లో వ్రాశాడు. ఇది ఎక్కడో భారతీయ రైల్వేలో… ఈ మనిషి వేగం అద్భుతం. 15 సెకన్లలో 3 మంది ప్రయాణికుల కు టిక్కెట్లు ఇస్తోంది.. ఈ న్యూస్ రాసే సమయానికి 1 లక్షా 50 వేలకు పైగా వ్యూస్, ఏడున్నర వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
క్లిప్ 18 సెకన్ల వ్యవధిని కలిగి ఉంది. ఈ వీడియోలో ఒక వృద్ధుడు రైల్వే ఉద్యోగి టిక్కెట్ వెండింగ్ మెషీన్ నుండి ప్రయాణీకులకు టిక్కెట్లను త్వరగా పంపిణీ చేయడాన్ని మనం చూడవచ్చు. అతడు స్పీడ్‌గా పనిచేస్తున్నాడు. కేవలం 15 సెకన్లలో ముగ్గురు ప్రయాణీకుల టిక్కెట్లను కంప్లీట్ చేస్తాడు. వీడియో వైరల్ కావడంతో ఆ పెద్దాయన అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.. ఈ ఉద్యోగం అతని అనుభవాన్ని చూపిస్తుందని కొందరు నిపుణులు అంటున్నారు.. ఏది ఏమైనా కూడా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది… వావ్ గ్రేట్ తాత నువ్వు..
Somewhere in Indian Railways this guy is so fast giving tickets to 3 passengers in 15 seconds. pic.twitter.com/1ZGnirXA9d
— Mumbai Railway Users (@mumbairailusers) June 28, 2022