లివర్ క్లీన్ అవ్వాలంటే ఈ చిట్కా పాటించాల్సిందే..!

-

ప్రస్తుత కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది ప్రజలకు ఆరోగ్యం పైన శ్రద్ధ పెరిగింది. అందుకే ప్రతిరోజు కూడా వారు తీసుకునే ఆహార పదార్థాలలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పౌష్టికాహారం తప్పకుండా ఉండేలాగా శ్రద్ధ చూపిస్తున్నారు. చాలా పౌష్టికాహారాలలో అత్యధిక పోషకాలు కలిగిన వాటిలో ఎండిన ద్రాక్ష కూడా ఒకటి . ఎండు ద్రాక్షను ఎక్కువగా తీపి పదార్థాలు తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు వీటిని నేరుగా కూడా తినడానికి ఇష్టపడతారు. అయితే ఎండ ద్రాక్ష వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి..

ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్లను మనం ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పంపడానికి ఎలాంటి చర్యలు మనం చేపట్టలేము. కాబట్టి ఇలా ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల ఆ వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.. ఎండు ద్రాక్షను నానబెట్టిన నీరు మన శరీరాన్ని చాలా చక్కగా శుభ్రం చేస్తుంది. శరీరంలోని వ్యక్తపదార్థాలను బయటకి పంపుతుంది. ఇలా చేయడం వల్ల లివర్ కూడా పరిశుభ్రం అవుతుంది.. దీనివల్ల లివర్లో పేరుకుపోయిన మలినాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి.

ఇలా నాలుగు రోజులపాటు క్రమం తప్పకుండా పాటించినట్లయితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రం అవుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే గుప్పెడు ఎండు ద్రాక్షలను తీసుకొని రెండు కప్పుల నీటిలో వేసి నీళ్లు ఒక కప్పు అయ్యేవరకు సన్నని మంటపైన మరిగించాలి.. నీరు మరిగిన తర్వాత ఆ స్టవ్ ను ఆఫ్ చేసి ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున వాటిని తిని ఆ నీటిని తాగాలి.. ఇలా క్రమం తప్పకుండా నాలుగు రోజులు పాటిస్తే లివర్ ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version