సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అటువంటి సోమవారం రోజు శివుడి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల, ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని అందరూ విశ్వసిస్తారు.. సోమవారంతెల్లవారు ఝామున నిద్ర లేచి తలస్నానం చేసి పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం పెట్టి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు పెట్టాలి తుమ్మి పూలు , మోదుగ పూలు చాల శ్రేష్టమైనవి గా చెప్పబడినవి. శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించి, ఆ విభూతిని నుదిటిన పెట్టుకోవాలి.
ఇక సాయంత్రం వరకుపాలు , పండ్లు వంటివి తీసుకుంటూ ఉపవాసము ఉండి శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి . సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం పెట్టాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పులు , ఆర్థికపరమైన సమస్యలు తగ్గి ఐశ్వర్యవంతులు అవుతారు. దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రతతో పెట్టాలి . అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు..
అంతేకాదు మూడు ఆకులుఉన్న బిల్వపత్రం శివుని మూడు కనులకు , త్రిశూలానికి గుర్తుగా భావిస్తారు. ఈ బిల్వపత్రాన్నిమహా శివునికి సమర్పించడం వల్ల దారిద్రయం తొలగి శాంతి లభిస్తుంది. శివునికి ప్రసాదంగా ఏ పండైనాపెట్టవచ్చు. శివునికి ప్రీతికరమైనది మాత్రం వెలగపండుగా చెప్పబడింది. ఇది దీర్ఘాయిష్షును ఇస్తుంది. ఈ పండుని స్వామికి పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. అదేవిధంగా ఉమామహేశ్వరులకు వేకువ జామున చేసే పూజ ఎక్కువ ఫలితాన్నిఇస్తుంది.. ఉదయం 4-5 గంటల సమయం దేవతల సంచార సమయం.. అందుకే అప్పుడే పూజలు చెయ్యడం చాలా మంచిది..