సోమవారం శివుడికి అత్యంత ప్రీతి కరమైన రోజు..ఈ రోజు భక్తితో పూజలు చేస్తె చాలా మంచిదని పండితులు చెబుతున్నారు..ఈ రోజున శివుడిని ఆరాధించే భక్తులపై మహాదేవుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శివుడిని ఆరాధించడం ద్వారా కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈరోజు శివయ్యను పూజించే విధి విధానాలను గురించి వివరంగా తెలుసుకుందాం..
కోరుకున్న జీవిత భాగస్వామిని పొందడానికి, శివుని ఆరాధన అత్యంత పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాదు వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే లేదా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడినా సోమవారం శివాలయానికి వెళ్లి శివయ్య దర్శనం చేసుకోండి..ఇంట్లో లింగం ఉన్నవాళ్లు కుంకుమ కలిపిన నీళ్ళను అభిషేకం చెయ్యాలి.
దోషాలు లేదా బాధలను తొలగించడానికి శివారాధన అత్యంత ప్రభావవంతమైన మార్గంగా పరిగణించ బడుతుంది. సోమవారం రోజున భక్తి శ్రద్దలతో పూజించే భక్తుడి దుఃఖాన్ని, బాధను శివుడు తొలగిస్తాడని నమ్మకం. శివుడిని ఆరాధించే భక్తుడిని శనీశ్వరుడు ఎప్పుడూ వేధించడు. సుఖ సంతోషలతో జీవిస్తాడని నమ్మకం..
రోగం నుంచి విముక్తి కలగడానికి రుద్రాక్ష జపమాలతో శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మెడలో ధరించే రుద్రాక్ష మాలతో శివ మంత్రాన్ని జపించకూడదని గుర్తుంచుకోండి..ఇందుకు వేరే మాలను పెట్టుకోవడం మంచిది.మనస్సులో శివ నామ స్మరణ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.. ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు..