నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో.. ‘ఇఫ్తార్‌ విందు’

-

రంజాన్‌ మాసం వచ్చేసింది. ముస్లిం సోదరులంతా రోజంతా ఉపవాసం చేస్తూ సాయంత్రం పూట ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్తార్ విందును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందును ఇవ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విందుకు హాజరు కానున్నారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతి ఏటా రంజాన్ మాసంలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీ ఈ ఏడాది కూడా కొనసాగనుంది.

ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ పరిశీలించారు. దేశంలో నిజమైన సెక్యులర్‌ ప్రభుత్వం తెలంగాణేనని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా జరుపుతోందని మంత్రులు అన్నారు. పేద ముస్లింలకు ఈ ఏడాది 4.50 లక్షల గిఫ్ట్‌ ప్యాక్‌లు అందజేశామని మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఇవాళ్టి విందులో సీఎం కేసీఆర్‌ అనాథ ముస్లిం పిల్లలకు దుస్తులు పంపిణీ చేస్తారని వెల్లడించారు. విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, దాదాపు 13 వేల మందికి ఆహ్వానాలు పంపామని మంత్రులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version