పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ రద్దు కు సిఫారసు చేస్తాం : ఐజీ

-

పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ రద్దు కు సిఫారసు చేస్తాం అని ఐజీ సత్య నారాయణ అన్నారు. కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరెందర్ రెడ్డి పరిగి లో విలేకరులతో సమావేశం నిర్వహించడంపై మండిపడ్డారు ఐజీ. పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెల్ పై ఉండి విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరి కాదు. ఫార్మా భూ సేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదు. పోలీస్ నిఘా వైఫల్యం అనడం సరికాదు.

లగచర్లలో 230 మంది పోలీసులతో బందోబస్తుగా ఏర్పాటు చేశాం. సురేష్ అనే వ్యక్తి పథకం ప్రకారమే కావాలని కలెక్టర్ని గ్రామంలోకి తీసుకువెళ్లాడు. కలెక్టర్ పై దాడి చేసినందుకే అరెస్టు చేశాం. ఎవరిని కూడా కొట్టలేదు రెండు నుంచి మూడు విడతలుగా దాడి చేసిన వ్యక్తులను పట్టుకోవచ్చాము సంబందంలేని వ్యక్తులను వదిలేశాం. కానీ ప్రెస్ మీట్ లో అవాస్తవాలు చెప్పాడు అని ఐజీ అన్నారు. ఇక ఏ ప్రభుత్వం కూడా రైతులకు బేడీలు వేయమని చెప్పదు. సురేష్ వాయిస్ రికార్డ్ మా దగ్గర ఉంది అతనే మొత్తం ప్లాన్ చేసాడు. టైం వచ్చినప్పుడు బయట పెడతాం. విచారణకు సురేష్ సహకరించడం లేదు. పట్నం నరేందర్ రెడ్డి కూడా తన ఫోన్ పాస్వర్డ్ చెప్పడం లేదు అని ఐజీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news