కుక్క కాపలాకు 45,000 రూపాయల జీతం.. ఎక్కడంటే?

-

దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిందే. వందల సంఖ్యలో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు లక్షల సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. డిగ్రీలు చదివి కూడా 5,000 రూపాయల వేతనానికి పని చేసే వాళ్లు దేశంలో ఎంతోమంది ఉన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోవడంతో నిరోద్యోగ రేటు భారీగా పెరిగింది.

దేశంలో కొత్త ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా ఐఐటీ ఢిల్లీ కుక్క కాపలా ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిన్న్ విడుదలైన ఈ నోటిఫికేషన్ గురించి యువతలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నోటిఫికేషన్ ఇంతలా వైరల్ కావడానికి రెండు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.

ఐఐటీ ఢిల్లీ బీటెక్ లేదా బీఎస్సీ లేదా బీకాం లేదా బీఏ చదివిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులని పేర్కొంది. ఈ ఉద్యోగానికి ఏకంగా 45,000 రూపాయల జీతం చెల్లిస్తామని ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. భారతీయ పౌరులై ఉండి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు. ఉద్యోగానికి ఎంపికైన వారి పనితీరును మొదటి మూడు నెలల పాటు పరిశీలించి వారు ఈ ఉద్యోగానికి అర్హులో కాదో వారిని కొనసాగించాలో..? వద్దో…? ఐఐటీ ఢిల్లీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ నోటిఫికేషన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తూ ఉండటం, పంచులు వేస్తూ ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version