అందం అంటే ఏంటో తెలిసింది – ఇలియానా

-

ఎంత అందంగా వున్నా ఎక్క‌డో కొంత వెలితి క‌నిపిస్తూ వుంటుంది. అలాంటి వెలితి గోవా బ్యూటీ ఇలియాన‌కూ వుంద‌ట‌. నాజూకు న‌డుమందాల‌తో టాలీవుడ్ కుర్ర‌కారుకి గిలిగింత‌లు పెట్టిన ఇల్లీ బేబీ త‌న అందం గురించి బాధ‌ప‌డిన సంద‌ర్భాలు వున్నాయ‌ట‌. ఇటీవ‌లే ఈ వియాన్ని నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకుంది. అంతేనా త‌న‌లోని లోపాల‌ని బ‌య‌ట‌పెట్టేసింది.

త‌న లుక్ విష‌యంలో ఎప్పుడూ బాధ‌ప‌డుతూ వుంటుంద‌ట‌. హిప్స్ (తొడ‌లు) వెడ‌ల్పుగా ఎడంగా వుంటాయ‌ని, స‌న్న‌టి న‌డుము, త‌న యెద అందాలు కూడా ఏ మంత ఆక‌ర్ష‌ణీయంగా త‌గినంత‌గా వుండ‌వ‌ట‌. పొట్ట ఫ్లాట్‌గా వుంటుంద‌ట‌. ముక్కు, పెదాలు అనుకున్న స్థాయిలో లేవ‌ట‌. దీనికి తోడు త‌ను ఫ‌న్నీగా వుండ‌ద‌ట‌. ఫ‌న్నీగా ఆలోచించ‌ద‌ట‌. త‌ను స్మార్ట్ కాద‌ని, ప‌రిప‌పూర్ణ‌మైన అంద‌గ‌త్తెని కాద‌ని భావించేద‌ట‌.

ప్ర‌స్తుతం త‌న ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింద‌ని, త‌ను రియ‌లైజ్ అయ్యాన‌ని, త‌న అవ‌ల‌క్షణాల గురించి ఆందోళ‌న చెంద‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ప్ర‌పంచంలో అంద‌మంటే ఏంటో అర్థం త‌న‌కు తెలిసిపోయింద‌ని, ఇకపై అందం గురించి పెద్ద‌గా ఆలోచించ‌న‌ని చెబుతోంది. త‌న అందం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన ఇలియానా వీటితో పాటు త‌న త్రోబ్యాక్ పిక్చ‌ర్‌ని షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version