నవగ్రహాలు.. మనపూర్వీకులు విశ్వంలోని అనేక రహస్యాలను ఆవిష్కరించారు. వారు నిర్ణయించిన ప్రకారం ఆయా గ్రహాలు (ప్రస్తుతం మనం అనుకుంటున్నవి) పూజిస్తే వాటి వల్ల మనకు శుభాలు కలుగుతాయి. అందుకే హిందు ధర్మంలో నవగ్రహారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పెద్దపెద్ద హోమాలు, పూజలు, శాంతులు చేసుకోలేనివారు నిత్యం నవగ్రహ గాయత్రిని శుచితో, శుద్ధమైన మనసుతో చేస్తే ఆయా గ్రహబాధలు పోతాయని పెద్దలు పేర్కొన్నారు. ఆయా గ్రహాలకు చెందిన గాయత్రిలను తెలుసుకుందాం…
సూర్య గాయిత్రి
ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.
చంద్ర గాయిత్రి
ఓం అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్నః శ్చంద్రః ప్రచోదయాత్.
కుజ గాయిత్రి
ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నఃకేతుః ప్రచోదయాత్.
బుధ గాయత్రి
ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.
గురు గాయత్రి
ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.
శుక్ర గాయత్రి
ఓం భార్గవాయ విద్మహే దైత్యాచార్యయ ధీమహి తన్నః శ్శుక్రః ప్రచోదయాత్.
శని గాయత్రి
ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్
రాహు గాయత్రి
ఓం శీర్షరూపాయ విద్మహే సింహికేశాయ ధీమహి తన్నోరాహుః ప్రచోదయాత్.
కేతు గాయిత్రి
ఓం తమోగ్రహాయ విద్మహే మహావజ్రాయ ధీమహి తన్నః కేతుః ప్రచోదయాత్.
– వీటిని ఎవరైతే నిత్యం ఉదయం పూట పఠిస్తారో వారికి గ్రహదోషాల తీవ్రత తగ్గుతుది. అనుకూల ఫలితాలు వస్తాయి.
– శ్రీ