సిరిసిల్ల జిల్లాలో అన్నదాతపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అక్రమ కేసు పెట్టించారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు సదరు రైతును అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సదరు రైతుకు భరోసా కల్పించారు.
పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిరిసిల్ల జిల్లా జిల్లెళ్ళ గ్రామానికి చెందిన రైతుకు కేటీఆర్ బెయిల్ ఇప్పించారని తెలుస్తోంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చొరవతో బెయిల్ మీద విడుదలై ఇంటికి వచ్చిన రైతును చూసిన కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://twitter.com/Nallabalu1/status/1894670664314872173