ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి

-

హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ చుట్టూ వినాయక నిమర్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ సుమారు 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమర్జనానికి ఎలాంటి ఆంక్షలు లేవని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమర్జనాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. శానిటేషన్, వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్, ఆర్ అండ్ బి, హార్టికల్చర్ తో పాటు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

రేపు ట్యాంక్ బండ్ పై వాహన రాకపోకలను నిషేధించారు. నిమర్జనాల కోసం గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గజ ఈతగాళ్ల బృందాలను ఏర్పాటు చేసింది. గణేష్ విగ్రహల వ్యర్ధాలను తొలగించేందుకు వాటర్ క్లీనింగ్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఏర్పాట్లపై ఎలాంటి రాజకీయాలు తగదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 20వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు సిపి.

Read more RELATED
Recommended to you

Exit mobile version