తెలంగాణ రాష్ట్రం లోని నదులు చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయడాన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిషేధించింది. పూజా సామాగ్రి కూడా వాటిలో వేయరాదని తెలిపింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, గంగానది జాతీయ కమిషన్ సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్లను కాలుష్య నియంత్రణ మండలి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య వల్ల నీటి కాలుష్యం భారీగా తగ్గుతుందని భావిస్తున్నారు.