వాట్సాప్ వెబ్ లో కోడ్ వెరిఫై ఫీచర్… వీటి కోసం తప్పక తెలుసుకోవాలి..!

-

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా కి అలవాటు పడిపోయారు. తప్పకుండా ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాట్సప్ వెబ్ లో సెక్యూరిటీను మరింత పెంచడానికి ఈ కొత్త ఫీచర్ ని తీసుకువచ్చారు. ఈ కొత్త ఫీచర్ కోడ్ వెరిఫై పేరుతో మనకి లభిస్తుంది. అదనపు సెక్యూరిటీ ఫీచర్ మనకి పని చేస్తుంది.

 

ఈ కోడ్ వెరిఫై అనేది బ్రౌజర్ పొడిగింపును అందిస్తూ వాట్సాప్ కోడ్ యొక్క యాక్సెస్ ని ధృవీకరిస్తోంది. అదే విధంగా వాట్సాప్ కోడ్ మారిందా లేదంటే తారుమారు అయిందా అనేది తనిఖీ చేయడానికి సహాయపడుతుంది. ఇక ఈ ఫీచర్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కోడ్ వెరిఫై ఫీచర్ ని వాట్సాప్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సెక్యూరిటీ కంపెనీ అయినటువంటి క్లౌడ్ ఫేర్ పార్టనర్ షిప్ తో రూపొందించారు.

వాట్సాప్ లో వినియోగదారులు పంపిన వ్యక్తిగత మెసేజ్లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో వారు పంపినవారి నుండి పొందిన వారికి సెక్యూరిటీని ఇస్తుంది. దీంతో సెక్యూరిటీ టైట్ గా ఉంటుంది. థర్డ్ పార్టీ యూజర్ ఎంట్రీ లేకుండా దీనిని తీసుకొచ్చారు. ఇక ఇది ఇలా ఉంటే వాట్సాప్ ద్వారా డెస్క్టాప్ వెర్షన్ కొత్త అప్డేట్ ని ఇచ్చింది. అయితే ఇది కేవలం బీటా వెర్షన్ కు మాత్రమే పరిమితం చేయబడుతుంది.

యాప్ లో ఏదైనా రికార్డింగ్ ను పాస్ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వాయిస్ మెసేజ్ ని పంపే ముందు ఒకసారి వినడానికి కూడా అవుతుంది. అలానే వాయిస్ నోట్ లో ఏదైనా జోడించాలి అనుకున్న లేదంటే ఏదైనా తొలగించాలని అనుకున్న కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version