జంగారెడ్డి గూడెం సహజమరణాలను టీడీపీ వక్రీకరిస్తున్నారని టీడీపీపై ఏపీ సీఎం జగన్ విమర్శించారు. ఈ 18 మరణాలు ఒకే ప్రాంతలో జరిగనవి కావని… మున్సిపాలిటీలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయని విమరణ ఇచ్చారు. సాధారణ మరణాలపై టీడీపీ అక్రమ ప్రచారం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుందని ఆయన ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారీని అణివేయాలని ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశాలు జారీ చేశాం అని అన్నారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్ట్ షాపులను రద్ధు చేశామని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. చంద్రబాబు హయాంలో 4380 మద్యం షాపులు ఉంటే అక్కడే పర్మిట్ రూంలు ఉంటే వాటన్నింటిని రద్దు చేశామని ఆయన వెల్లడించారు. లాభాషేక్షతో గతంలోని ప్రభుత్వాలు మద్యాన్ని ప్రోత్సహించాయని టీడీపిని విమర్శించారు. బడి, గుడి, గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు ఉండేవని.. ప్రస్తుతం ప్రభుత్వమే వైన్ షాపులను నిర్వహిస్తోందని.. కరెక్ట్ టైంకు షాపులు మూతపడేలా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో లిక్కర్ రేట్లు పెట్టడం వల్ల… మద్యం అమ్మకాలు తగ్గాయని.. ఇదే సమయంలో కల్తీ మద్యం పెరిగిందని, అయితే.. మళ్లీ రేట్లను తగ్గించామని.. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న రేట్లనే తీసుకువచ్చామని ఆయన అన్నారు. ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా కల్తీ మద్యం ఉండే అవకాశం లేదని ఆయన సభకు వెల్లడించారు.