ఇండియాకి ఇమ్రాన్ వార్నింగ్: అణు యుద్ధానికి సిద్ధమేట…!

-

జమ్మూ-కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన దగ్గర నుంచి పాకిస్థాన్ ఇండియా పై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ నిర్ణయాన్ని తప్పుపడుతూ మోడీ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తూనే ఉంది. కశ్మీర్ కోసం ఎంత దూరమైన వెళతామని మన దేశానికి వార్నింగ్ ఇస్తోంది. పైగా కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుండటంతో పాకిస్థాన్ బెదిరింపు ధోరణి కనబరుస్తోంది.

ఇప్పటికే పలుమార్లు ఇండియాని రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు నోరు జారారు. తాజాగా ఆయన కశ్మీర్ విషయంపై మాట్లాడుతూ..ఇండియాతో పాటు అగ్రరాజ్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. కశ్మీర్ వివాదం యుద్ధానికి దారి తీస్తే మాత్రం ఆ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయని వార్నింగ్ ఇచ్చారు.అయితే రెండు దేశాలు అణ్వాయుధ సహిత దేశాలే అని, అణుయుద్ధంలో విజేత అంటూ ఎవరూ ఉండరని, ఈ పరిస్థితుల్లో ప్రపంచ అగ్రరాజ్యాలపై పెను బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఒకవేళ అగ్రరాజ్యాలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, పాకిస్థాన్ ఎంత దూరమైనా వెళుతుందంటూ బెదిరింపు గళం వినిపించారు. మరోవైపు ఇండియాపై కూడా ఇమ్రాన్ విమర్శలు చేశారు.

ఈ విషయంలో ఇండియాతో చర్చలు జరపాలని చూసిన సరైన స్పందన రాలేదన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి చారిత్రాత్మక తప్పు చేసిందని,  సొంత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను, ఐక్యరాజ్యసమితి సూచనలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఇక ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే భారత్ తో అణు యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు అర్ధమవుతుంది.

ఇరు దేశాలకు అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పకనే చెబుతూ పరోక్షంగా యుద్ధానికి రెడీ అన్న‌ట్టుగా ఇమ్రాన్ తీరు ఉంది. అనవసరంగా భారత్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇమ్రాన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరి ఇమ్రాన్ వ్యాఖ్యలో భవిష్యత్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version