ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. కమ్మ సామాజిక వర్గం భూములు ఇచ్చింది కాబట్టే ఇంత రచ్చ అవుతుందని, వాళ్ళు అందుకే ఇంత పట్టుబడుతున్నారు అని. తాజాగా దీనిపై దళిత బహుజన ఫ్రంట్ ఒక లెక్క విడుదల చేసి హైకోర్ట్ లో కేసు వేసింది. అమరావతి బడుగు, బలహీన వర్గాల రాజధాని, అమరావతికి భూములిచ్చిన సామజిక వర్గాలు అని లెక్క పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ – 32%, రెడ్డి – 23%, కమ్మ – 18%, బీసీ – 14%, కాపు – 9%, మైనారిటీ – 3%, ఇతరులు – 1% ఉన్నారు అని లెక్కలో చెప్పారు. కాగా అమరావతి వ్యవహారం రాష్ట్ర హైకోర్ట్ లో నలుగుతుంది. అమరావతి తరలింపు విషయంలో ఇచ్చిన స్టేటస్ కో ని వచ్చే నెల 5 వరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.