ఏపీలో కరోనా డేంజర్ బెల్స్… తాజాగా 10,128 కొత్త కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గటం లేదు. గడచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు మీడియా బులిటెన్ పరంగా వివరాలను వెల్లడించింది. నేడు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పదివేల మార్కును దాటాయి. తాజాగా 60,576 శాంపిల్స్ పరీక్షించగా 10,128 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,86,461 కి చేరుకుంది.

ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 8,729 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా తాజాగా కరోనా బారినపడి 77 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య నేటి వరకు 1681 కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,35,646 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 1544 కొత్త కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో అత్యధికంగా నేటి వరకు 221 మంది మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version