BIG BREAKING : తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు కేటాయింపులు.. వాటర్ కమీషన్ వార్నింగ్

-

రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత నీటి అవసరాల కోసం కేటాయింపులు చేసింది కృష్ణా బోర్డ్. తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా 7.746 టీఎంసీ లు.. సాగర్ ఎడమ కాలువ నుంచి 22.186 టీఎంసీలు.. హైదరాబాద్ తాగునీరు, మిషన్ భగీరథ కోసం 7.740 టీఎంసిలు కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్ కు ఏపీ తాగునీటి అవసరాల కోసం , చెన్నై తాగునీటి కోసం రెడ్డి పాడు ద్వారా 9 టీఎంసీలు, హంద్రీనీవా కు 8 టీఎంసీ లు కేటాయింపులు చేసింది. ఇదిలా ఉంటే కృష్ణ బేసిన్ రాష్ట్రాలను హెచ్చరించింది సెంట్రల్ వాటర్ కమిషన్. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహాబలేశ్వరం, కోయినా డ్యామ్ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుండడంతో కింది ప్రాంతాలకు భారీ వరద నీరు చేరే అవకాశం ఉందని చెప్పింది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు లకు ఈ నెలలోనే భారీ వరద నీరు చేరే అవకాశం ఉందని చెప్పింది. రెండు మూడు రోజుల్లోనే 75% వరకు ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణకు:
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా 7.746 టీఎంసీలు
సాగర్ ఎడమ కాలువ నుంచి 22.186 టీఎంసీలు
హైదరాబాద్ తాగునీరు, మిషన్ భగీరథ కోసం 7.740 టీఎంసీలు

ఆంధ్రప్రదేశ్ కు:
ఏపీ తాగునీటి అవసరాల కోసం , చెన్నై తాగునీటి కోసం రెడ్డి పాడు ద్వారా 9 టీఎంసీలు

హంద్రీనీవా కు 8 టీఎంసీ లు కేటాయింపు

Read more RELATED
Recommended to you

Exit mobile version