హైదరాబాదులో..అందుకే పోలింగ్ శాతం తగ్గింది: కిషన్ రెడ్డి

-

హైదరాబాద్‌లో కొంత పోలింగ్ శాతం తగ్గిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నగరంలో నివాసం ఉంటే ఎక్కువ మంది ఆంధ్ర ప్రదేశ్ వాళ్లు కావడం, ఓట్ల కోసం అందరూ అక్కడికి వెళ్లడంతో నగరంలో ఓటింగ్ శాతం తగ్గిందని ఆయన తెలిపారు.

ఓటు వేసిన వారంతా మోడీకే వేశామని బహిరంగంగా చెబుతున్నారు. అన్ని ప్రాంతాల్లో మార్పు మొదలైంది. మోడీ నాయకత్వాన్ని తెలంగాణ కోరుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ఈసారి గ్రామాల్లో కూడా బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయి అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాష్ట్రంలో ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కూడా నమ్మలేదని విమర్శించారు. మెజార్టీ ఓట్లు మోడీవైపే మొగ్గుచూపారని చెప్పారు.పార్టీ ఏదైనా సరే.. ప్రధానిగా మోడీనే ఉండాలనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడిందని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version